Nag Ashwin: ‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ క్లారిటీ.. దీపిక పదుకొణె పాత్ర మార్పుపై వస్తున్న వార్తలపై షాకింగ్ కామెంట్స్!

Nag Ashwin

Nag Ashwin: యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ‘కల్కి 2’ (Kalki 2) పై అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ పార్ట్-2 గురించి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ రూమర్లకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు.

‘కల్కి’ ఫస్ట్ పార్ట్‌లో దీపికా పదుకొణె పోషించిన ‘సుమతి’ పాత్ర ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది. అయితే పార్ట్-2 లో ఈ పాత్రను తొలగిస్తున్నారని, లేదా ఆ క్యారెక్టర్ కోసం సాయి పల్లవిని తీసుకుంటున్నారని జోరుగా ప్రచారం సాగింది. ఈ వార్తలపై నాగ్ అశ్విన్ తాజాగా స్పందిస్తూ.. అవన్నీ కేవలం పుకార్లేనని తేల్చి చెప్పారు. ‘కల్కి’ కథలో సుమతి పాత్ర అత్యంత కీలకమైనదని, ఆ పాత్ర చుట్టే కథ నడుస్తుందని స్పష్టం చేశారు. అలాగే సాయి పల్లవి ఎంట్రీపై వస్తున్న వార్తలను కూడా ఆయన పూర్తిగా ఖండించారు.

Also Read :  divyendu sharma: వెంకీ - త్రివిక్రమ్ ‘AK47’ లోకి రామ్‌బుజ్జి!

“కల్కి 2 మూవీకి సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యాయి. రాబోయే సెప్టెంబర్ నెల నుంచి ఈ సినిమా నాన్‌స్టాప్ షూటింగ్ జరుపుకోనుంది. సినిమాకు సంబంధించిన మిగతా పూర్తి వివరాలను సరైన సమయంలో అధికారికంగా వెల్లడిస్తాం” అని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. డైరెక్టరే స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ‘కల్కి 2’ పై ఉన్న సస్పెన్స్‌కు తెరపడటమే కాకుండా, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్ వంటి దిగ్గజాలు నటిస్తున్న ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.