Srikanth Odela: మెగాస్టార్-శ్రీకాంత్ ఓదెల సినిమా ఆగిపోయిందా? ‘ఫ్యాన్‌బాయ్’ ఓదెల మార్క్ రియాక్షన్..

Srikanth Odela

Srikanth Odela: మెగాస్టార్ చిరంజీవి, ‘దసరా’ ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ లైన్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు, ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమాపై వస్తున్న వార్తలన్నీ కేవలం రూమర్స్ అని, వాటిలో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల ‘ది పారడైజ్’ (#TheParadise) పనుల్లో బిజీగా ఉన్నారు. కొన్ని కారణాల వల్ల ‘ది పారడైజ్’ షూటింగ్, రిలీజ్ ఆలస్యమవుతున్నప్పటికీ, డైరెక్టర్ మాత్రం ఈ ప్రాజెక్ట్‌ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన పూర్తి శ్రద్ధ అంతా ఈ సినిమాపైనే ఉంది.

Also Read :  Raj Nidimoru: మనోజ్ బాజ్‌పాయ్ ప్లేస్‌లో మెగాస్టార్.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ చిరంజీవి కోసం రాసుకున్న కథ!

‘ది పారడైజ్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ.. శ్రీకాంత్ ఓదెల తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన చిరంజీవి సినిమాను ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం లేదని సమాచారం. ‘ది పారడైజ్’కు సమాంతరంగా రైటర్స్ టీమ్‌తో కలిసి మెగా సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు. ‘ది పారడైజ్’ సినిమా విషయంలో ఇబ్బందులు మెగాస్టార్ సినిమాకు రాకూడదని శ్రీకాంత్ ఓదెల చాలా జాగ్రత్త పడుతున్నారని సమాచారం. అందుకే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఆరు నెలల ముందే స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పక్కాగా పూర్తి చేయాలని చిత్ర బృందం డిసైడ్ అయ్యిందని చెబుతున్నారు. చిరంజీవికి వీరాభిమాని అయిన శ్రీకాంత్ ఓదెల.. ఒక ‘ఫ్యాన్‌బాయ్‌’గా తన హీరోకి కెరీర్‌లోనే మైండ్ బ్లోయింగ్ సినిమా ఇవ్వాలని ఒక ‘బ్లడ్ ప్రామిస్’తో వర్క్ చేస్తున్నారట. ఈ సినిమా ఆగిపోయిందని ఇప్పటి వరకు వస్తున్న వార్తలన్నీ కేవలం రూమర్స్ మాత్రమే ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.