
Nagarjuna: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. జూలై 10న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని చిత్ర యూనిట్ గ్రాండ్‌గా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన కింగ్ నాగార్జున స్టేజ్‌పై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా కోసం తాను తిరుమల వేంకటేశ్వరస్వామిని కోరిన కోరిక, అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందించిన సపోర్ట్‌ను గుర్తుచేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. “నేను ఎన్నోసార్లు తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాను. కానీ ఎప్పుడు వెళ్లినా నా కోసం ఏ రోజూ, ఏమీ అడిగింది లేదు. కానీ ఈసారి మాత్రం నా కొడుకు అఖిల్ కోసం స్వామివారిని ఒక కోరిక కోరాను. ‘మా వాడికి ఒక హిట్ ఇవ్వండి… బ్లాక్ బస్టర్ ఇవ్వండి’ అని మనస్ఫూర్తిగా అడిగాను. నా ప్రార్థనలు ఆలకించిన ఆ వెంకటేశ్వర స్వామికి ముందుగా నా కృతజ్ఞతలు” అంటూ ఎమోషనల్ అయ్యారు.
అనంతరం ఈ సినిమాకు పవర్ఫుల్ వాయిస్ ఓవర్ ఇచ్చి సపోర్ట్‌గా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్‌ను నాగార్జున ప్రత్యేకంగా అభినందించారు. “మా పెద్ద అబ్బాయి తారక్‌కు (ఎన్టీఆర్) నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా కోసం తారక్ నిలబడిన విధానం, చూపించిన ప్రేమ ఎప్పటికీ మరువలేనిది” అంటూ సంతోషం వ్యక్తం చేశారు. మురళీ కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ మాస్ పెర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సక్సెస్ మీట్లో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా పాల్గొని, తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ఆదరణకు స్టేజ్ పైనే కన్నీటి పర్యంతమైంది. మొత్తానికి ‘లెనిన్’ విజయంతో అక్కినేని క్యాంప్‌లో పండగ వాతావరణం నెలకొంది.














