Shiva 4k Trailer : ‘శివ’ రీ-రిలీజ్ ట్రైలర్ చూశారా ?.. నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియెన్స్!

Shiva
Shiva 4k Trailer : కింగ్ నాగార్జున ఆల్‌టైమ్ కల్ట్ క్లాసిక్ ‘శివ’ ఒకప్పట్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ ఇండియన్ సినిమాకు కొత్త దిశ చూపింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989లో విడుదలైన ఈ చిత్రం రియలిస్టిక్ యాక్షన్, మ్యూజిక్‌లతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మాతలు అక్కినేని వెంకట్ మరియు సురేంద్ర యార్లగడ్డ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నాగార్జున కెరీర్‌ లో ఒక మైలురాయిగా నిలిచింది.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

అయితే అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా, ‘శివ’ చిత్రాన్ని 4K డాల్బీ ఆట్మాస్ లో నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సమక్షంలో ‘శివ’ రీరిలీజ్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు. అద్భుతమైన 4K విజువల్స్, డాల్బీ ఆట్మాస్ సౌండ్ తో ట్రైలర్ అదిరిపోయింది. ప్రతి సీన్‌లో టెన్షన్‌‌, ఎమోషన్‌ ఆడియన్స్ ని కట్టిపడేసింది. ట్రైలర్ చివర్లో నాగర్జున సైకిల్ చైన్ లాగిన సీన్ గూస్బంప్స్ క్రియేట్ చేసింది. ‘శివ’ మ్యాజిక్ ని 4K డాల్బీ ఆట్మాస్ లో థియేటర్స్ లో చూడాలనే ఎక్సయిట్మెంట్ ట్రైలర్ మరింతగా పెంచింది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల