
Rao Bahadur: సూపర్‌స్టార్ మహేష్ బాబు సమర్పణలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘రావ్ బహదూర్’. ఈ సినిమా నిర్మాణత చింతా గోపాలకృష్ణ రెడ్డి తాజాగా రిలీజ్ అయిన సినిమా ట్రైలర్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రాజెక్ట్ పట్టాలెక్కడం వెనుక ఉన్న అసలు కారణాన్ని, నమ్రత శిరోద్కర్ వహించిన కీలక పాత్రను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఈ ‘రావ్ బహదూర్’ కథను అందరికంటే ముందుగా నమ్రత గారు విన్నారు. కథలోని వైవిధ్యం, కొత్తదనం ఆమెకు బాగా నచ్చడంతో.. వెంటనే ఆ విషయం నాకు చెప్పారు. ఆ తర్వాతే నేను ఈ సినిమాపై డైరెక్టర్‌ను కలిసి పూర్తి కథ విన్నాను. నమ్రత గారు కథను జడ్జ్ చేసిన విధానం, నన్ను గైడ్ చేసిన తీరు అద్భుతం” అని పేర్కొన్నారు. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతోనే సూపర్‌స్టార్ మహేష్ బాబు గారు ఈ చిత్రానికి ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తున్నారని ఆయన వెల్లడించారు. “మహేష్ బాబు గారి లాంటి గ్లోబల్ స్టార్ మా ‘రావ్ బహదూర్’ సినిమాని ప్రజెంట్ చేయడం మాకు దక్కిన అతిపెద్ద అదృష్టం. ఒక నిర్మాతగా నాకు ఇది చాలా మంచి అవకాశం. సినిమా కచ్చితంగా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.









