The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఫిక్స్? సోషల్ మీడియాలో డేట్ వైరల్!

The Paradise

The Paradise: న్యాచురల్ స్టార్ నాని – మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise). ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదీకి సంబంధించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను సెప్టెంబర్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దసరా పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ ఈ డేట్‌ను లాక్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.

Also Read :  divyendu sharma: వెంకీ - త్రివిక్రమ్ ‘AK47’ లోకి రామ్‌బుజ్జి!

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్‌పై త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందట. ఈ చిత్రంలోని ఇంటర్వెల్ సీక్వెన్స్‌ను డైరెక్టర్ ఎంతో స్పెషల్‌గా డిజైన్ చేశారని చెబుతున్నారు. ఈ సన్నివేశాన్ని స్టోరీని కొత్త మలుపు తిప్పేలా, ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించే స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. యాక్షన్, ఎమోషన్, విజువల్ గ్రాండియర్ అన్నీ కలిసే ఈ ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో సీనియర్ నటుడు మోహన్ బాబు విలన్ రోల్‌లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాని పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.