
Upasana Konidela: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ నేడు (జూన్ 4, 2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే చిత్ర స్పెషల్ స్క్రీనింగ్‌లో ఒక అన్‌సీన్, ఊరమాస్ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాధారణంగా ఎంతో సాఫ్ట్‌గా, క్లాస్‌గా కనిపించే మెగా కోడలు ఉపాసన కొణిదెల.. థియేటర్‌లో పక్కా మాస్ ఆడియన్‌లా మారిపోయి చేసిన హంగామా ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
ఉపాసన కొణిదెల తన తండ్రితో కలిసి ఈ స్పెషల్ ప్రీమియర్స్‌కు హాజరయ్యారు. థియేటర్‌లో కౌంట్‌డౌన్ ముగిసి, స్క్రీన్‌పై రామ్ చరణ్ పవర్‌ఫుల్ టైటిల్ రోల్‌లో ఊరమాస్ లుక్‌తో ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం.. ఉపాసనలోని డైహార్డ్ ఫ్యాన్ బయటకు వచ్చారు. ఆమె పేపర్లను గాల్లోకి విసురుతూ, అభిమానులతో కలిసి ఈలలు, కేకలతో థియేటర్‌ను హోరెత్తించారు. భర్త స్క్రీన్ ప్రెజెన్స్‌ను చూసి ఆమె ముఖంలో పొంగిపొర్లిన ఆనందం, గర్వం మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. పెద్ది చిత్రంతో వెండి తెరపై బుచ్చిబాబు విజువల్ వండర్ క్రియేట్ చేశారని మెగా ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. 1980ల నాటి రూరల్ ఆంధ్రప్రదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ మునుపెన్నడూ లేని రగ్గడ్ అండ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించారు. భారీ బడ్జెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఎంటర్‌టైనర్.. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే సరికొత్త రికార్డులను తిరగరాస్తూ బాక్సాఫీస్ వద్ద ‘హౌస్‌ఫుల్’ బోర్డులతో రన్ అవుతోంది. ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వి కపూర్ గ్లామర్, కన్నడ సెన్సేషన్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీల పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయని అంటున్నారు. ప్రస్తుతం మెగా కోడలు థియేటర్‌లో చేసిన హంగామా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Upasana garu is throwing papers for RC’s entry ❤️ #Peddi #Ramcharan #Upasana pic.twitter.com/9g6Ng33eES
— justin telugu (@JustinTelu59343) June 3, 2026











