
Mega159: మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ప్రస్తుతం ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తెరకెక్కుతున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన బజ్ ఉంది. అలాగే మెగాస్టార్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలు లైన్‌లో ఉండగానే ఇప్పుడు మెగాస్టార్ కొత్త సినిమాపై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రస్తుతం చిరంజీవి చేతిలో రెండు ప్రాజెక్టులు పూర్తయ్యే దశకు చేరుకోవడంతో, ఆయన నెక్స్ట్ మూవీ ‘మెగా159’కు దర్శకుడు ఎవరనే అంశంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రేసులో సుకుమార్ శిష్యుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
‘ది ప్యారడైజ్’ ఆలస్యం కారణంగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో చిరంజీవి చేయాల్సిన సినిమా మరింత ముందుకు వెళ్లినట్లు సమాచారం. దీంతో చిరంజీవి ప్రస్తుతం రెండు పూర్తయిన ప్రాజెక్టులతో ఉన్నారని టాక్. ఈ నేపథ్యంలో ‘మెగా159’ కోసం బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ ఓదెల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు సానా ఇప్పటికే మెగాస్టార్‌కి ఓ కథను వినిపించినట్లు సమాచారం. మరోవైపు శ్రీకాంత్ ఓదెల టీమ్ కూడా చిరంజీవి సినిమా కథపై పని చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఇద్దరు యువ దర్శకుల్లో మెగాస్టార్‌తో తదుపరి సినిమా చేసే అవకాశం ఎవరికి దక్కుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుకుమార్ శిష్యులుగా ఇండస్ట్రీలోకి వచ్చిన బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల తమ తొలి చిత్రాలతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బుచ్చిబాబు ‘ఉప్పెన’తో దర్శకుడిగా సత్తా చాటగా, శ్రీకాంత్ ఓదెల ‘దసరా’తో తనదైన మేకింగ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. వీరిద్దరూ సుకుమార్ వద్ద పనిచేసిన అనుభవం ఉన్నవారే. ప్రస్తుతం బుచ్చిబాబు ‘పెద్ది’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ.. తన నెక్ట్స్ సినిమా స్క్రీప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారట. మరోవైపు శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’తో బిజీగా ఉన్నారు. అయితే ‘మెగా159’ను ఎవరు తెరకెక్కిస్తారనే విషయంలో ఇప్పటివరకు అధికారిక ప్రకటన బయటికి రాలేదు. దీంతో సుకుమార్ శిష్యులైన బుచ్చిబాబు సానా – శ్రీకాంత్ ఓదెలలో .. మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎవరికి దక్కుతుందనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.














