Peddi collections: కర్ణాటకలో ‘పెద్ది’ కలెక్షన్ల జాతర.. పుష్ప 2, ఓజీ రికార్డులు గాల్లోకి! రూ.3.02 కోట్లతో ఆల్ టైమ్ రికార్డ్స్..

Peddi collections: బాక్సాఫీస్ దగ్గర ‘మెగా’ సునామీ స్టార్ట్ అయ్యింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం.. అంతకంటే ముందే జరిగిన పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా కర్ణాటకలో అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది.

పుష్ప 2, ఓజీ రికార్డులు బద్దలు కొట్టిన పెద్ది..
కర్ణాటక బాక్సాఫీస్ చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా ‘పెద్ది’ చిత్రం ప్రీమియర్ షోల ద్వారా ఏకంగా రూ.3.02 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ రికార్డ్ కలెక్షన్లతో, అప్పటి వరకు ఉన్న ‘పుష్ప 2’, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ లాంటి మోస్ట్ హైప్డ్ సినిమాల రికార్డులను చరణ్ బద్దలు కొట్టడం విశేషం. ఈ రేంజ్ ఓపెనింగ్స్‌తో కన్నడ గడ్డపై రామ్ చరణ్ తన వన్‌మెన్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించుకున్నారని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read :  Janhvi Kapoor: ‘పెద్ది’ రిలీజ్ వేళ తిరుమలలో జాన్వీ కపూర్.. కాలినడకన కొండపైకి ఎక్కిన ‘అచ్చియమ్మ’ !

కలిసొచ్చిన శివన్న క్రేజ్
కర్ణాటకలో ఈ స్థాయి రికార్డ్ బుకింగ్స్ నమోదు కావడానికి గల కారణాలను ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రామ్ చరణ్‌కు ఉన్న గ్లోబల్ క్రేజ్‌కు తోడు, కన్నడ నటసింహం శివరాజ్‌కుమార్ ఈ సినిమాలో ఒక కీలకమైన పవర్‌ఫుల్ పాత్ర పోషించడం పెద్దికి కొండంత బలాన్ని ఇచ్చిందని అంటున్నారు. కన్నడ ఇండస్ట్రీలో శివన్నకు ఉన్న మాస్ ఫాలోయింగ్, రామ్ చరణ్ ఊరమాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి కర్ణాటక ఆడియన్స్‌ను థియేటర్ల వైపు పరుగులు పెట్టించాయని చెబుతున్నారు. ఒక్క కర్ణాటకలోనే కాకుండా, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ కొనసాగుతుంది. యూఎస్ఏ (USA) ప్రీమియర్స్ నుంచే ఈ సినిమా మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరి రికార్డులు క్రియేట్ చేస్తోంది. బాక్సాఫీస్ విశ్లేషకుల అంచనా ప్రకారం.. ‘పెద్ది’ మొదటి రోజే గ్లోబల్ వైడ్‌గా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.