
Mowgli 2025 : ‘బబుల్‌గమ్’తో సక్సెస్‌ఫుల్‌గా సినీ రంగంలో అడుగుపెట్టిన యంగ్ హీరో రోషన్ కనకాల, తన రెండో చిత్రం ‘మోగ్లీ 2025’ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత, కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, కృతి ప్రసాద్‌లు నిర్మిస్తున్నారు. అడవి నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్‌గా నిలవగా, తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసిన టీజర్ సినిమాపై భారీ హైప్ సృష్టించింది. జీవితాన్ని ఆనందంగా గడపాలనుకునే మోగ్లీ అనే యువకుడు ప్రేమలో పడిన తర్వాత ఎదురయ్యే సవాళ్లు, ఒక క్రూర పోలీస్ ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది.
దర్శకుడు సందీప్ రాజ్ టీజర్‌ను ఆధునిక రామాయణంలా చూపిస్తూ, హీరో–హీరోయిన్ల ప్రేమను రామ–సీతల బంధంగా, విలన్ పాత్రను రావణుడిలా ప్రజెంట్ చేశారు. రోషన్ కనకాల కొత్త లుక్‌లో, ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన సహజ డైలాగ్‌లతో ఆకట్టుకున్నాడు. చెవిటి–మూగ పాత్రలో సాక్షి మదోల్కర్ సహజంగా నటించింది. విలన్‌గా బండి సరోజ్ కుమార్ ఇంటెన్స్‌గా కనిపించగా, వైవా హర్ష తన హాస్యంతో అలరించాడు. అద్భుతమైన విజువల్స్, ఎమోషనల్ డ్రామా, బలమైన కథతో ‘మోగ్లీ 2025’ డిసెంబర్ 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
BEAUTIFUL. SUPERB. REALLY GOOD. ADHIRIPOINDHI 🔥🔥🔥
Man of Masses @tarak9999 garu launched the #MowgliTeaser and extended his best wishes to the young team ❤️🔥❤️🔥❤️🔥
— https://t.co/k2t1d2lULk#Mowgli2025 GRAND RELEASE WORLDWIDE on 12th DEC 2025 🔥 pic.twitter.com/FOeAVHWVpS
— People Media Factory (@peoplemediafcy) November 12, 2025











