Premante : ప్రియదర్శి రొమాంటిక్ ఫన్ టచ్‌తో ఆకట్టుకున్న ‘ప్రేమంటే’ టీజర్!

Premante
Premante : స్ట్రాంగ్ కంటెంట్‌ ఆధారిత చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి, ఈసారి రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘ప్రేమంటే’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది హీరోయిన్‌గా నటిస్తుండగా, సుమ కనకాల కీలక పాత్రలో కనిపిస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మిస్తున్న ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై రూపొందుతోంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తున్న ఈ సినిమా, దివంగత నారాయణ్ దాస్ నారంగ్ గారికి ట్రిబ్యూట్‌గా నిలుస్తోంది. ఆదిత్య మెరుగు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా టీజర్‌ ను రిలీజ్ చేసారు మేకర్స్.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

టీజర్‌లో కొత్త పెళ్లి జంట జీవితంలోని సరదా, ప్రేమ, గిల్లికజ్జాల మేళవింపును చక్కగా చూపించారు. పెళ్లి తర్వాత కలల ప్రపంచంలో ఊహించిన ప్రేమ వాస్తవ జీవితంలోని చిన్న చిన్న విభేదాలతో ఎలా మారుతుందో రసవత్తరంగా చూపించారు. ప్రియదర్శి–ఆనంది జంట మధ్య సహజమైన కెమిస్ట్రీ ఆకట్టుకోగా, సుమ కనకాల పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పాత్రలో హాస్యాన్ని మరింత ఎలివేట్ చేశారు. వెన్నెల కిషోర్ తన ప్రత్యేక కామెడీతో నవ్వులు పంచారు. లియాన్ జేమ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక “Thrill-U Prapthirasthu!” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం నవంబర్ 21న విడుదల కానుంది.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!