
Ramayana: నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ (#Ramayana) సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన బిజినెస్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘ధర్మా ప్రొడక్షన్స్’ కరణ్ జోహార్ ఆధ్వర్యంలో భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ రైట్స్‌ను ధర్మా ప్రొడక్షన్స్ సుమారు రూ.250 కోట్లకు దక్కించుకుందని తెలుస్తోంది. భారతీయ సినిమా చరిత్రలోనే ఇదొక అతిపెద్ద డీల్ అయినప్పటికీ, ఈ నంబర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారితీశాయి. దీనికి ప్రధాన కారణం ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ కావడం.
గతంలో ఈ చిత్ర నిర్మాతలు, రామాయణం రెండు భాగాల మొత్తం బడ్జెట్ దాదాపు రూ.4000 కోట్లు ఉంటుందని ప్రకటించారు. ఇంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న సినిమాకు, కేవలం రూ.250 కోట్లకే ఇండియా థియేట్రికల్ రైట్స్ అమ్ముడవడం సినీ విశ్లేషకులతో పాటు నెటిజన్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంత పెద్ద బడ్జెట్ ప్రాజెక్ట్‌కు ఈ డీల్ వాల్యూ చాలా తక్కువగా ఉందనే సందేహాలు నెటిజన్ల నుంచి వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇది కేవలం థియేట్రికల్ రైట్స్ మాత్రమేనని, ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ అలాగే ఓవర్సీస్ రైట్స్ దీనికి అదనం కాబట్టి నిర్మాతలు సేఫ్ జోన్లోనే ఉంటారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రేడ్ నంబర్స్‌పై రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ, ఈ బిజినెస్ డీల్‌పై అటు ధర్మా ప్రొడక్షన్స్ కానీ, ఇటు రామాయణ చిత్ర యూనిట్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ఈ వార్తలపై పూర్తి స్పష్టత వచ్చే వరకు వీటిని కేవలం ఎర్లీ రిపోర్ట్స్ గానే పరిగణించాల్సి ఉంటుంది.









