Rakta Charitra: ఆర్జీవీ కల్ట్ క్లాసిక్ ‘రక్తచరిత్ర’ 4K రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!

Rakta Charitra

Rakta Charitra: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ పొలిటికల్ డ్రామాగా నిలిచిన ‘రక్తచరిత్ర’ సినిమా రీ-రిలీజ్‌కు రెడీ అయ్యింది. సరికొత్త సాంకేతికతతో, అల్ట్రా హై-డెఫినిషన్ విజువల్స్, మైండ్ బ్లోయింగ్ సౌండ్ క్వాలిటీతో ‘రక్తచరిత్ర 4K’ వర్షన్ థియేటర్లలోకి రాబోతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా తేదీని ఖరారు చేసింది. ఈ నెల 17 న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో రీ-రిలీజ్ చేయబోతున్నారు. అనంతపురం ఫ్యాక్షనిజం, రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతాప్ రవి పాత్రలో జీవించగా, శత్రుఘ్న సిన్హా, రాధికా ఆప్టే, కోట శ్రీనివాసరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్జీవీ మార్క్ రా సినిమాటోగ్రఫీ, ఇంటెన్స్ డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలబెట్టాయి.

ప్రస్తుతం టాలీవుడ్‌లో కల్ట్ సినిమాలను 4K ఫార్మాట్‌లో రీ-రిలీజ్ చేసే ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ‘రక్తచరిత్ర’ వంటి హై-వోల్టేజ్ ఫ్యాక్షన్ డ్రామాను మళ్లీ బిగ్ స్క్రీన్‌పై, అదీ 4K విజువల్ ఎక్స్‌పీరియన్స్‌తో వీక్షించే అవకాశం రావడంతో సినీ ప్రియులు, వర్మ అభిమానులు ఎంతగానో ఎగ్జైట్ అవుతున్నారు. జూలై 17న థియేటర్లలో మరోసారి ప్రతాప్ రవి విధ్వంసం షురూ కానుండటంతో సోషల్ మీడియాలో #RaktaCharitra4K ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.