
Sambarala Yeti Gattu: సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘సంబరాల యేటి గట్టు’. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ హైదరాబాద్‌లో నడుస్తోంది. ఇందుకోసం చిత్ర బృందం నగరంలోనే ఒక భారీ సెట్‌ను నిర్మించింది. ప్రస్తుతం ఈ సెట్‌లోనే క్లైమాక్స్, కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు టాక్.
ఈ సినిమా సాయి దుర్గ తేజ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ మైలురాయిగా నిలవబోతోంది. ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు లేనంత అత్యధిక బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాను రూపొందిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘హను-మాన్’ వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌ను అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో, ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా టీజర్ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.












