
Megastar Chiranjeevi: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, సెన్సిబుల్ డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్లో వచ్చిన సరికొత్త చిత్రం “మా ఇంటి బంగారం”. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో సమంత నటనకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, ఎమోషన్స్‌ను అందంగా మేళవిస్తూ డైరెక్టర్ నందిని రెడ్డి తనదైన స్టైల్లో ఈ చిత్రాన్ని పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించారని సినిమా చూసిన సాధారణ ప్రేక్షకులు చెబుతూ మురిసిపోతున్నారు. ముఖ్యంగా సాంప్రదాయక చీరకట్టులో ఆమె చేసిన యాక్షన్ సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ, సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా కలిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు హీట్ టాపిక్‌గా మారింది. “మా ఇంటి బంగారం“ చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో తెరకెక్కించారు. @Samanthaprabhu2 నటన, ముఖ్యంగా చీరకట్టులో చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలాంటి వైవిధ్యమైన, మహిళా ప్రాధాన్య చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమకు అవసరం. ఈ విజయానికి సమంత, నందిని రెడ్డి, రాజ్, మొత్తం చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. అలాగే జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత & రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు. అని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. గత కొన్ని రోజులు స్టార్ హీరోయిన్ సమంత తల్లి కాబోతున్న వార్తలు సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సమంత జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలు కానుందని పోస్ట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయ్యిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా సమంత – రాజ్ దంపతులకు నెటిజన్లు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటి వరకు సమంత కానీ రాజ్ కానీ అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు.
“మా ఇంటి బంగారం“ చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో తెరకెక్కించారు. @Samanthaprabhu2 నటన, ముఖ్యంగా చీరకట్టులో చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.… pic.twitter.com/eE5xemjh3c
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 23, 2026











