Shambhala : NATSలో హాట్ టాపిక్‌గా ‘శంబాల’..

Shambhala
Shambhala : యంగ్, వెర్సటైల్ యాక్టర్ ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ సినిమా టీజర్‌కి అపూర్వ స్పందన లభిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, మేకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) 2025లో ఈ టీజర్ ప్రదర్శించగా, అక్కడి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఈవెంట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, నటీమణులు సమంత, శ్రీలీలలు హాజరై సందడి చేశారు. సంగీత దర్శకుడు ఎస్.థమన్ లైవ్ కచేరీలో టీజర్ ప్లే చేయగా, ఆయన ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘శంబాల’ టీజర్ ఈ కార్యక్రమంలో హాట్ టాపిక్‌గా మారడం విశేషం.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌కు యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రవీణ్ కె. బంగారి సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతుండగా, థియేటర్ మరియు ఓటీటీ హక్కుల విషయంలో భారీ పోటీ నెలకొంది. సినిమా విడుదల తేదీని త్వరలోనే మేకర్లు ప్రకటించనున్నారు.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్