
‘పలాస 1978’ ద్వారా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి, ‘హిట్’ సిరీస్‌తో యూత్‌లో ప్రత్యేక క్రేజ్ సంపాదించిన కోమలి ప్రసాద్ జంటగా నటించిన తాజా చిత్రం ‘శశివదనే’. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించగా, రవితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా పూర్తిగా ఒక అందమైన విలేజ్ లవ్ స్టోరీ నేపథ్యంతో సాగుతుంది. గోదావరి లంక గ్రామంలో తన తండ్రి (శ్రీ మాన్)తో కలిసి నివసించే రాఘవ (రక్షిత్) అనుకోకుండా పక్కూరి గ్రామానికి చెందిన అమ్మాయి (కోమలి ప్రసాద్)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. పేరుతో మొదలైన చిన్న పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే వేర్వేరు కులాలకు చెందిన వీరి ప్రేమ ఎంత వరకు వెళ్లింది? మధ్యలో ఎదురైన అడ్డంకులు ఏవి? చివరకు వారి ప్రేమకు ఎలాంటి ముగింపు దక్కింది? అనేది ఈ చిత్రంలోని ప్రధాన కథ.









