
Riya Shibu: వైవిధ్యమైన నటనతో ‘మక్కల్ సెల్వన్’గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి, ప్రస్తుతం కోలివుడ్‌లో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ కృత్తిక ఉదయనిధి డైరెక్షన్‌లో ఒక భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నై పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది.
అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సర్వం మాయ సినిమాలో ‘డెలూలు’ (Maya) క్యారెక్టర్‌తో నెటిజన్ల మనసులు గెలుచుకున్న యంగ్ బ్యూటీ, నటి కమ్ ప్రొడ్యూసర్ ర్యా షిబు ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. విజయ్ సేతుపతి సరసన ఆమె ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోందని సినీ వర్గాల సమాచారం. ఎమోషనల్ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రోహిత్ అబ్రహం సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రైజ్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సరికొత్త కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.









