ఏపీలో తగ్గిన కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. కొన్నిరోజుల కిందటి వరకు పది వేలకు పైగా కేసులు వస్తుండడంతో అధికార వర్గాలు బెంబేలెత్తిపోయాయి. అయితే, రెండ్రోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య పది వేలకు దిగువన నమోదవుతోంది.

తాజాగా 6,780 కరోనా కేసులు వెల్లడయ్యాయి. జిల్లాల్లోనూ కొద్దిమేర ఉద్ధృతి తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. తూర్పు గోదావరి (911) జిల్లాలో వెయ్యికి దరిదాపుల్లో కొత్త కేసులు వచ్చినా మిగిలిన జిల్లాల్లో సాధారణ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంగతి చూస్తే… జిల్లాల్లో మృత్యుఘంటికలు మోగుతున్నట్టే భావించాలి. గడచిన 24 గంటల్లో 82 మంది మృత్యువాత పడ్డారు.  

Also Read :  రూ.2 లక్షలతో నీటి సదుపాయం… ప్రభుత్వ పాఠశాలలకు అండగా ‘కైండ్ ఇండియా’