డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర

ఏపీలో సస్పెండ్ అయ్యి కొంతకాలం తర్వాత అరెస్టయిన దళత డాక్టర్ సుధాకర్ కేసు కొత్త మలుపు తిరిగింది. 8 వారాల్లో సుధాకర్ కేసును ఛేదించాలని హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ పత్రికలకు కూడా ఎక్కిన ఈ కేసులో కుట్ర కోణం ఉందని సీబీఐ తేల్చి చెప్పింది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

హైకోర్టులో ఈరోజు పిటిషను దాఖలు చేసిన సీబీఐ మరింత సమయం కావాలని పేర్కొంది. సీబీఐ వినతి మేరకు ఈ కేసు దర్యాప్తులో పూర్తి చేయడానికి ఏపీ హైకోర్టు మరో రెండు నెలల గడువు ఇచ్చింది.