‘దేశానికి పట్టిన దరిద్రం వదిలింది బాబ్జి’

కేంద్ర ప్రభుత్వం చైనా యాప్‌లపై బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించింది. పిల్లల్లో నేరప్రవృత్తి పెంచేలా పబ్జీ గేమ్‌ ఉండటంతో ఈ యాప్‌ను ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయంతో గూగుల్‌, యాపిల్‌ ప్లేసోర్ట నుంచి పబ్జీని తొలగించారు. పబ్జీతో పాటు బైడు, క్యామ్‌కార్డ్‌, విచాట్‌ రీడింగ్‌, టెన్సెంట్‌ వీన్‌, సైబర్‌ హంటర్‌, లైఫ్‌ ఆఫ్టర్‌ వంటి పలు యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

పబ్జీని దాదాపు 70 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ గేమ్‌కు యువత బానిసగా మారడంతో పబ్జీ గేమ్‌ను తొలగించాలని చాలాకాలంగా పలువురు కోరుతున్నారు. ఇక సరిహద్దుల్లో డ్రాగన్‌ దూకుడుతో ఉద్రిక్తత నెలకొన్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ నిర్ణయాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. ‘దేశానికి పట్టిన దరిద్రం వదిలిపొయింది బాబ్జి’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు కొందరు.