ముంబయిని ఆపడం కష్టం

ముంబయి జట్టు కొన్నేళ్ల పాటు ఇదే ఆటగాళ్లతో కొనసాగితే భవిష్యత్‌లోనూ ఓడించడం కష్టమని చెన్నై మాజీ బ్యాట్స్‌మన్‌ షేన్‌వాట్సన్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా దిల్లీని ఓడించిన ముంబయి 13వ సీజన్‌లోనూ విజేతగా నిలిచి ఐదోసారి కప్పు సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టును అభినందిస్తూ  మాట్లాడాడు. ఈ సీజన్‌లో రోహిత్‌ సేన అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని, ఆ జట్టును వేలెత్తి చూపడానికి ఏమీ లేదని ,  ఈ సీజన్‌లో ఆడినన్ని రోజులూ ఆ జట్టు మెరుగవుతూనే ఉందన్నాడు.  

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

 కాగా, ఈ ఏడాది చెన్నై తరఫున చివరిసారి బరిలోకి దిగిన ఈ ఆస్ట్రేలియా క్రికెటర్‌ మొత్తం 11 మ్యాచ్‌ల్లో 299 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధశతకాలు నమోదు చేశాడు. ఇక ఈ టీ20 లీగ్‌ మొత్తంలో 145 మ్యాచ్‌లు ఆడగా 3,874 పరుగులు చేశాడు. అందులో నాలుగు శతకాలు, 21 అర్ధశతకాలు ఉన్నాయి. 

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల