మూడు కోట్లకు దాటిన కరోనా టెస్టులు

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను ఆయా ప్రభుత్వాలు ముమ్మరం చేశాయి. దేశవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా నిత్యం దాదాపు 6నుంచి 8లక్షల శాంపిళ్లకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

తాజాగా నిన్న ఒక్కరోజే మరో 7లక్షల 31వేల శాంపిళ్లకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. దీంతో ఆగస్టు 16వరకు దేశంలో మొత్తం 3కోట్ల 41వేల (3,00,41,400) శాంపిళ్లకు కొవిడ్‌ టెస్టులు పూర్తిచేసినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది. ఆగస్టు 12వ తేదీన ఒక్కరోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 8లక్షల 30వేల పరీక్షలు నిర్వహించారు.