వ్యాక్సిన్ పై కేంద్రం కసరత్తు

ఇండియాలో కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన ఐదు ఫార్మా కంపెనీలు, జాతీయ నిపుణుల కమిటీతో సమావేశమై, పురోగతిని వివరించాయి. వ్యాక్సిన్ వస్తే, దాని ధర ఎంతవరకూ ఉంటుంది? ఎన్ని రోజుల్లో ఎన్ని డోస్ లను ఉత్పత్తి చేయగలుగుతాం? అనే విషయాలపై ఈ సంస్థలు వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పై ఏర్పాటు చేసిన కమిటీకి సమాచారాన్ని అందించాయి.

Also Read :  రూ.2 లక్షలతో నీటి సదుపాయం… ప్రభుత్వ పాఠశాలలకు అండగా ‘కైండ్ ఇండియా’

ప్రస్తుతం ఇండియాలో భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ ను, జైడస్ కాడిలా సంస్థ జైకోవిడ్ ను తయారు చేస్తుండగా, ఇవి రెండూ పూర్తి స్వదేశీ వ్యాక్సిన్ లు. ఇదే సమయంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికాలు తయారు చేసిన వ్యాక్సిన్ ను అందించనుంది. ఈ మూడింటితో పాటు బయోలాజికల్ ఈ, జెన్నోవా బయో ఫార్మాస్యుటికల్స్ కంపెనీలు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నాయి.

Also Read :  రూ.2 లక్షలతో నీటి సదుపాయం… ప్రభుత్వ పాఠశాలలకు అండగా ‘కైండ్ ఇండియా’

ఈ కంపెనీలకు కేంద్రం తరఫున ఏదైనా సహాయం అవసరమైతే చేసేందుకు సిద్ధమేనని కమిటీ హామీ ఇచ్చింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, ప్రొడక్షన్ కెపాసిటీని పెంచేందుకు సాయం చేస్తామని పేర్కొంది.