శ్రీశైలం లో మళ్ళీ కలకలం

తెలంగాణ పరిధిలోని శ్రీశైలం జలాశయం ఎడమ గట్టు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాద ఘటన కలకలం సృష్టించింది. విద్యుత్‌ కేంద్రంలోకి సామగ్రిని తీసుకెళ్తున్న డీసీఎం వ్యాను.. పక్కనే ఉన్న విద్యుత్‌ కేబుళ్ల పైనుంచి వెళ్లడంతో షార్ట్‌సర్క్యూట్‌లా రావడంతో దాదాపు 10మిటర్ల చొప్పున మంటలు ఎగసిపడ్డాయి. ఇటీవల జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకున్న అక్కడి సిబ్బంది భయంతో పరుగులు తీశారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

 దీనికి సంబంధించిన వార్తలు ఒక్కసారిగా గుప్పుమనడంతో జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు స్పందించారు.  ఇది ప్రమాదం కాదని, ఇటీవల జరిగిన భారీ ప్రమాదంతో పునరుద్ధరణ పనులు జరుగుతున్న వేళ ఈ కేంద్రంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించినట్టు స్పష్టంచేశారు. మరోసారి అగ్నిప్రమాదం జరిగితే ఎలా స్పందిస్తారోనని మాక్‌డ్రిల్‌ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. చివరకు ఇది.. మాక్‌ డ్రిల్‌ అని తెలియడంతో సిబ్బంది, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల