సిరాజ్ .. మెరుపుల్

యూఏఈ గడ్డపై జరుగుతున్న ఐపీఎల్ తాజా సీజన్ లో అతి తక్కువ స్కోరు నమోదైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 84 పరుగులు చేసింది. బెంగళూరు బౌలింగ్ కు కోల్ కతా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. బెంగళూరు జట్టులో హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో కోల్ కతా బ్యాట్స్ మన్లకు అగ్నిపరీక్ష పెట్టాడు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

సిరాజ్ బౌలింగ్ తీరుకు అతడి గణాంకాలే నిదర్శనం. 4 ఓవర్లు విసిరిన ఈ పొడగరి ఫాస్ట్ బౌలర్ కేవలం 8 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. రెండు మొయిడెన్లు వేశాడు. సిరాజ్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే తొలి రెండు వికెట్లు తీయడం విశేషం. వరుసగా రెండు బంతుల్లో రాహుల్ త్రిపాఠి (1), నితీశ్ రానా (0)లను అవుట్ చేశాడు.