దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించి ఢిల్లీ మర్కజ్ ప్రార్థనాల గురించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పలు వివరాలను వెల్లడించారు. దేశంలో నమోదైన కేసుల్లో 4,291 కరోనా కేసులకు ఢిల్లీ మర్కజ్‌కు సంబంధించినవే అని స్పష్టం చేశారు.
అత్యధికంగా తమిళనాడులో 84 శాతం, ఢిల్లీలో 63 శాతం కేసులు, తెలంగాణలో 79 శాతం, యూపీలో 59 శాతం ఏపీలో 50 శాతం కేసులు మర్కజ్‌కు లింక్ ఉన్నవే అని తెలిపారు. వైరస్ కారణంగా మృతి చెందిన వారిలో కూడా ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారే ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు.
భారత్‌లో శనివారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,378కి చేరింది. గడిచిన 24 గంటల్లో 991 కొత్త కరోనా కేసులు నిర్ధారణ కాగా.. 43 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 480కి చేరింది.









