తెలంగాణ లో 500 దాటినా కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో శనివారం నాటికీ కరోనా పాజిటివ్ కేసులు 500 క్రాస్ అయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో శనివారం మరో 16 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని దీంతో 503కు కరోనా కేసులు అయినట్లు అధికారులు తెలిపారు. శనివారం కొత్తగా నల్గొండ జిల్లాలో 3, ఆసిఫాబాద్‌ 2, ఖమ్మం 2, నిర్మల్‌‌ 2, నిజామాబాద్‌ 2, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కోటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ సంఖ్య చూస్తే… 17 లక్షల 80 వేల 271కు చేరుకుంది. ఇప్పటివరకు కోవిడ్‌-19 కారణంగా 1 లక్షా 8 వేల 822 మంది మృతిచెందారు. వ్యాధి నుంచి 4 లక్షల 4 వేల 29 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అమెరికాలో 20,577 మంది చనిపోగా, స్పెయిన్‌-16,606, ఇటలీ-19,468, ఫ్రాన్స్‌-13,832, జర్మనీ-2,871, చైనా-3,339, యూకే-9,875, ఇరాన్‌-4,357, టర్కీ-1,101, బెల్జియం-3,346, స్విర్జర్లాండ్‌-1,036, నెదర్లాండ్స్‌-2,643, బ్రెజిల్‌లో 1,140 మంది కోవిడ్‌-19 కారణంగా మృత్యువాతపడ్డారు.