లాక్ డౌన్ ఎఫెక్ట్ : పాస్ అడిగినందుకు ఏఎస్సై చేతిని నరికేశారు..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నడుస్తున్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండడం తో ఆంక్షలు కఠినం చేసారు. ప్రజలను రోడ్ల పైకి ఏమాత్రం అనుమతించడం లేదు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచిస్తున్నారు. కొంతమంది మాత్రం పాస్ ల పేరుతో , మెడికల్ పేరుతో రోడ్ల పైకి వస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఓ వ్యక్తిని పోలీసులు పాస్ అడుగగా..సదరు వ్యక్తి ఏఎస్సై చేతిని నరికేసిన ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 6.15 సమయంలో సనౌర్‌లోని కూరగాయల మార్కెట్‌ వద్ద పోలీసులు.. తనిఖీలు చేపట్టి, కర్ఫ్యూ పాసులు ఉన్నవారినే లోనికి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కారు బారీకేడ్లను ఢీకొంటూ ఆ ప్రాంతానికి దూసుకువచ్చింది. వెంటనే పోలీసులు ఆ కారును చుట్టుముట్టారు. కారులో ఉన్న ఏడుగురు నిహంగ్‌ సిక్కులు తల్వార్లు పట్టుకుని కిందకు దిగారు. వెంటనే పోలీసులపై విరుచుకుపడ్డారు. ఏఎస్సై హర్జీత్‌ సింగ్‌ చేతిని ఓ దుండగుడు నరికివేశాడు.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

సదర్‌ పటియాలా ఎస్‌హెచ్‌వో, మరో కానిస్టేబుల్‌ను గాయపరిచారు. ఆ తర్వాత దుండగులంతా బల్బేరాలోని ఓ గురుద్వారాలో దాక్కొన్నారు. చేయి తెగిపడిన ఏఎస్సైని చికిత్స నిమిత్తం చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌ ఆస్పత్రికి తరలించామని, అక్కడ ప్లాస్టిక్‌ సర్జరీ నిపుణులు ఏడున్నర గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి, అతడి చేతిని తిరిగి అతికించారని డీజీపీ తెలిపారు. ప్రస్తుతం ఆ దుండగులను అరెస్ట్ చేసినట్లు సమాచారం.