మాస్క్ వేసుకోలేదని దారుణంగా కొట్టారు

నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మాస్కు వేసుకోమని చెప్పినందుకు తోటి ఉద్యోగినిపై మరో ఉద్యోగి విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది.

నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్‌ కార్యాలయంలో కాంట్రాక్ట్‌ మహిళా ఉద్యోగిపై డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ ఇనుప రాడ్డుతో దాడి చేశారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

కరోనా నేపథ్యంలో మాస్కు వేసుకోమన్నందుకు ఆగ్రహించిన డిప్యూటీ మేనేజర్‌ ..మహిళా ఉద్యోగిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకున్న తోటి ఉద్యోగులపైనా ఆగ్రహం వెళ్లగక్కారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వెలుగులోకి వచ్చింది.