కరోనా ఓ ఏసీపీ ప్రాణాల్ని బలితీసుకుంది


పంజాబ్‌లోని లుధియానాలో కరోనా వైరస్‌ ఓ ఏసీపీ ప్రాణాల్ని బలితీసుకుంది. ఈ మహమ్మారి బారిన ఏసీపీ అనిల్‌ కోహ్లీ మృత్యువాతపడ్డారు. కొవిడ్‌ 19 సోకడంతో ఎస్‌పీఎస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందినట్టు డీపీఆర్‌వో కార్యాలయం వెల్లడించింది. పంజాబ్‌లో ఇప్పటివరకు 200లకు పైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

కాగా దేశంలో గత 24గంటల్లో 991 కరోనా పాజిటివ్‌ కేసులు; 43 మరణాలు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ వైరస్‌ బారిన పడినవారిలో 1992 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ సంయుక్త కమిషనర్‌ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. భారత్‌లోని కరోనా బాధితుల్లో మరణాలు 3.3శాతం మాత్రమేనన్నారు.