రెడ్ జోన్లలో కరోనా వైరస్ ఎందుకు పెరుగుతుందో తెలుసా..?

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ముఖాయంగా ఆంధ్ర లో రెడ్ జోన్లలో వైరస్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇలా ఎందుకు అవుతున్నాయనే దానిపై సీపీ ద్వారకా తిరుమలరావు రెడ్ జోన్లలో పర్యటించారు. పర్యటన అనంతరం రెడ్ జోన్లలో కేసులు ప్రగాడనికి కారణం ప్రజలు లాక్ డౌన్ ను పట్టించుకోకుండా బయట తిరగటమే అన్నారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

పోలీసులు ఎంత కృషి చేసిన ప్రజల్లో అంతర్గత ప్రేరణ లేదన్నారు. కాలనీలోకి బయటి వారిని లోపలి రానివ్వక పోవడంతోనే కరోనాను అదుపు చేయలేమని లోపల వాళ్ళతో కూడా దూరంగా ఉండాలని అన్నారు. వీధుల్లో ప్రజల సంచారంతోనే కేసుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. అందువల్లనే రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చారు.