ముస్లిం సోదరులకు తెలుగు ముఖ్యమంత్రుల రంజాన్ శుభాకాంక్షలు

ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే ‘ రంజాన్ ‘ పండుగ ఈరోజు. ముస్లింలు చాంద్రమాన కేలండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల ‘రంజాన్’, దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ‘ దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘ రంజాన్ మాసం ‘. అలాంటి పండగ సంధర్బాహంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

రంజాన్‌ మత సామరస్యానికి నిదర్శనమని, పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని కోరారు సీఎం కేసీఆర్‌. రంజాన్‌ పండుగ సామరస్యం, సహృద్భావం, దాతృత్వానికి ప్రతీకని అన్నారు ఏపీ సీఎం జగన్‌. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ జాగ్రత్తలు పాటిస్తూ.. కఠిన ఉపవాస దీక్షలు ఆచరించడం అభినందనీయమన్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు.