నిజాముద్దీన్‌ తరహా లో మరో ఘటన..అక్కడికి వెళ్లినవారికి కరోనా

దేశంలో కరోనా కేసులు తగ్గాయి అనుకునే టైం లో ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో జరిగిన పార్థనల కారణంగా కరోనా కేసులు దేశ వ్యాప్తంగా పెరిగాయి. ఈ ప్రార్థనలకు అన్ని జిల్లాల నుండి వెళ్లడం తో వారి ద్వారా దేశంలో కేసుల సంఖ్య భారీ పెరిగింది. ఇప్పుడు ఇదే తారల్లో ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

తాజాగా ఉత్తరప్రదేశ్ డియోబంద్‌కు వెళ్లిన వారిలోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీరు డియోబంద్‌కు వెళ్లి వచ్చారని అనుమానిస్తున్నారు. నిజాముద్దీన్ తరహాలోనే యూపీలో ప్రార్థనలు జరిగాయని తెలుస్తుంది.. నిజాముద్దీన్ వెళ్లిన వారు యూపీ డియోబంద్.. ఆ తర్వాత రాజస్థాన్ ఆజ్మీర్ దర్గాను సైతం సందర్శించారని చెబుతున్నారు. మొత్తం మీద అధికారులకు మరో తలనొప్పి పట్టుకున్నట్లు అయ్యింది.