వైకాపాకి ప్రభుత్వానికి పవన్ విన్నపం

వైకాపా ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ . ఇలాంటి సంక్షోభంలో అందరినీ కలుపుకొని వెళ్లాలనే ఆలోచన వైకాపా ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇలాంటి విపత్కర సమయంలో రాజకీయాల కంటే ప్రజలకు ధైర్యం, భరోసా ఇవ్వడమే ముఖ్యమన్నారు.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

వ్యక్తిగత వ్యవహారంలా కక్ష సాధింపు వైఖరితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతులు, కూలీలు, కార్మికులు, పేదల కష్టాలపై దృష్టి సారిద్దామని పార్టీ నేతలకు పవన్‌ పిలుపునిచ్చారు. నిర్మాణాత్మక విమర్శలతో ప్రజలపక్షాన మాట్లాడుదామన్నారు.