
ZEE5: ఓటీటీ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా ప్లాట్‌ఫారమ్‌లు కూడా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ ZEE5 భారీ మార్పులతో సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం కంటెంట్‌ను అందించడమే కాకుండా.. యూజర్ ఏం చూడాలనుకుంటున్నాడో అర్థం చేసుకుని అనుభవాన్ని మరింత వ్యక్తిగతంగా మార్చేలా కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.
ఇక కంటెంట్ వెతకాల్సిన పని లేదా?
కొత్త ZEE5లో అత్యంత ఆకర్షణీయమైన మార్పుల్లో AI ఆధారిత పర్సనలైజేషన్ ఒకటి. యూజర్ అభిరుచులు, చూసే కంటెంట్ ఆధారంగా వారికి నచ్చే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఇతర కార్యక్రమాలను సులభంగా గుర్తించేలా ఈ టెక్నాలజీని రూపొందించారు. దీంతో గంటల తరబడి కంటెంట్ కోసం వెతకాల్సిన అవసరం తగ్గనుంది. మొబైల్‌లో చూస్తున్న కంటెంట్‌ను పెద్ద స్క్రీన్‌పై కొనసాగించాలనుకునే వారికి కూడా కొత్త అనుభవాన్ని అందిస్తోంది. ఫోన్ నుంచి కనెక్టెడ్ టీవీకి మారినప్పుడు అనవసరమైన అంతరాయాలు లేకుండా కంటెంట్‌ను కొనసాగించేలా క్రాస్-స్క్రీన్ అనుభవాన్ని అప్‌గ్రేడ్ చేసింది.
సబ్‌స్క్రిప్షన్, ప్లేబ్యాక్, యాక్సెస్ లేదా డివైజ్‌కు సంబంధించిన సమస్య ఎదురైతే కస్టమర్ సపోర్ట్ కోసం ఎక్కువసేపు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా AI ఆధారిత కస్టమర్ అసిస్టెంట్‌ను కూడా ZEE5 పరిచయం చేసింది. యూజర్లకు ఎదురయ్యే సాధారణ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. అంతేకాదు.. యూజర్ల డేటా, ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తూ కొత్త డేటా ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్లను కూడా ప్లాట్‌ఫారమ్‌లో చేర్చింది. కొత్త ZEE5 అనుభవాన్ని ఐదు ప్రధాన విభాగాలుగా విభజించారు. ప్రీమియం ఎంటర్‌టైన్‌మెంట్, Free 5, Kids, TV, Sports విభాగాల ద్వారా యూజర్లు తమకు కావాల్సిన కంటెంట్‌ను మరింత సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
ప్రాంతీయ భాషల కంటెంట్‌తో పాటు అంతర్జాతీయ వినోదానికి కూడా ZEE5 ప్రాధాన్యత పెంచుతోంది. FIFA World Cup 2026, 2030 స్పోర్ట్స్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్న నేపథ్యంలో స్పోర్ట్స్ కంటెంట్‌ను మరింత విస్తరిస్తోంది. అలాగే PVR INOX Pictures, Lionsgate Playతో భాగస్వామ్యాల ద్వారా అంతర్జాతీయ సినిమాలను భారతీయ ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తోంది. నార్మల్, ది ఇన్వైట్, యాంగ్జియస్ పీపుల్, బేబీస్, ది విజార్డ్ ఆఫ్ ది క్రెమ్లిన్, హౌ టు మేక్ ఎ కిల్లింగ్, టోనీ, పేపర్ టైగర్ వంటి గ్లోబల్ కంటెంట్ కూడా ఈ విస్తరణలో భాగంగా ఉండనుంది.
మొత్తంగా చూస్తే.. కంటెంట్ స్ట్రీమింగ్ నుంచి కంటెంట్ డిస్కవరీ వరకు ప్రతిదీ AI ఆధారంగా మరింత సులభం చేయడమే కొత్త ZEE5 లక్ష్యంగా కనిపిస్తోంది. భారతీయ, ప్రాంతీయ కంటెంట్‌తో పాటు స్పోర్ట్స్, పిల్లల వినోదం, అంతర్జాతీయ సినిమాలను ఒకే వేదికపైకి తీసుకురావడంతో ఓటీటీ రంగంలో కొత్త అనుభవాన్ని అందించేందుకు ZEE5 సిద్ధమైంది.














