బింబిసార సెన్సార్ !


కళ్యాణ్ రామ్ , కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ జంటగా వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా బింబిసార. టైమ్​ ట్రావెల్​ సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిన ఈ మూవీ లో కల్యాణ్​రామ్​.. పౌరాణిక పాత్రలో కనిపించనున్నారు. చిరంతన్ భట్ ఈ సినిమా పాటలకి సంగీతం అందిస్తుండగా, ఎం ఎం కీరవాణి బాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఎన్టీఆర్​ ఆర్ట్స్ బ్యానర్​పై కల్యాణ్​రామ్​ స్వయంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగష్టు 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలచేసిన పోస్టర్స్, ట్రైలర్ ఈ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేసాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం 2 గంటల 26 నిమిషాల నిడివి ఉన్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.