రైల్వే శాఖలో 872 మందికి కరోనా..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువ గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. సామాన్య ప్రజలే కాక రాజకీయ నేతలు , పోలీసులు , డాక్టర్స్ , బిజినెస్ రంగానికి చెందినవారు , సినీ ప్రముఖులు ఇలా ప్రతి ఒక్కరు దీని బారిన పడుతున్నారు. తాజాగా రైల్వే శాఖలో 872 మంది కరోనా భారిన పడ్డారు.

అత్యధికంగా సెంట్రల్‌ రైల్వేలో 559 మంది, వెస్ట్రన్‌ రైల్వే నుంచి 313 మందికి కరోనా సోకినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు వైరస్ సోకినట్టు నిర్ధారించారు. కరోనా బాధితులందరికి వెస్ట్రన్‌ రైల్వేకు చెందిన జగ్జీవన్‌ రామ్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ ఆస్పత్రిని కోవిడ్ బాధితులకోసం ప్రత్యేకంగా కేటాయించామని తెలిపారు.