టాలీవుడ్ లో మొదలైన దసరా సందడి, ఓటిటి కూడా …


దసరా సందడి మొదలు కావడంతో ఈ రోజు నుండి వరుసపెట్టి రిలీజ్ చేస్తున్నారు తెలుగు చిత్ర నిర్మాతలు. ఈ రోజు (సెప్టెంబర్ 29) ధనుష్ నటించిన నేనే వస్తున్న చిత్రం విడుదల కాగా, రేపు (సెప్టెంబర్ 30) మణిరత్నం దర్శకత్వం లో వస్తున్న పాన్ ఇండియా మూవీ పొన్నియన్ సెల్వం విడుదల కానుంది. కాగా ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక దసరా పండగ రోజున (అక్టోబర్ 5) చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మరియు నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రాలు విడుదల కానున్నాయి.

ఇక ఓటిటి విషయానికొస్తే ఈ వారం ఓటిటి లవర్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్ ‘బింబిసారా’ , నితిన్ ‘మాచెర్ల నియోజకవర్గం’ , విక్రమ్ ‘కోబ్రా ‘ లాంటి పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి.