
అల వైకుంఠపురం లో చిత్రంతో నాన్ బాహుబలి రికార్డు కొట్టిన త్రివిక్రమ్ ..ప్రస్తుతం నాల్గు సినిమాలను లైన్ లో పెట్టాడు. వాటిల్లో ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు. ఎన్టీఆర్ 30 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 1 నుండి సెట్స్ పైకి వెళ్లనుందట. నిజానికి ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ లోనే మొదలుపెట్టాలన్నది ప్లాన్ అయినప్పటికీ లాక్ డౌన్ కారణంగా అది కుదరలేదు.
ఈ చిత్రానికి ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సంగతి పక్కన పెడితే ఈ చిత్రంలో విలన్‌గా మంచు మనోజ్‌ను తీసుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్‌లో ప్రచారం జరగడం తో అంత నిజమే కావొచ్చని నమ్మేశారు. కానీ ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని మంచు మనోజ్ టీం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతోన్న రూమర్‌లో పూర్తిగా అసత్యమని, ప్రస్తుతం మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారని మంచువారబ్బాయి టీం మీడియా వర్గాలకు వెల్లడించింది.









