
‘పుష్ప’ చిత్రం ఇప్పుడు రష్యాలోనూ విడుదల కానుంది. ‘పుష్ప ది రైజ్’ చిత్రం రష్యాలో డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని రష్యా భాషలోకి డబ్ చేసి విడుదల చేస్తుండడం విశేషం. విడుదలకు ముందు డిసెంబరు 1న మాస్కోలో, డిసెంబరు 3న సెయింట్ పీటర్స్ బర్గ్ లో పుష్ప ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ మేరకు చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపింది.









