కంచెను కాపీ చేసిన రాధేశ్యామ్

ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రాధేశ్యామ్‌ వచ్చేసాడు. సాహో తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్ ను చూసిన వారంత కంచె పోస్టర్ ను భలేగా కాపీ చేశారే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

కంచె సినిమా పోస్టర్‌లో కూడా వరుణ్ తేజ్- ప్రగ్యా జైస్వాల్ అచ్చం ప్రభాస్- పూజా హెగ్డే లాగే రొమాంటిక్ లుక్‌లో కనిపించారు. దీంతో ఈ రెండు పోస్టర్ జత చేస్తూ ట్రోల్స్ స్టార్ట్ చేసేశారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల పోస్టర్స్ తో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.