
ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ హాస్పటల్ లో జాయిన్ అయినా సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుండడం తో ఆయన్ను గచ్చిబౌలిలోని ఏషియన్ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స అందించారు. అయితే తేజ ఆరోగ్యం ఫై సోషల్ మీడియా లో పలు రకాల వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో తన ఆరోగ్యం ఫై స్వయంగా ఆయనే క్లారిటీ ఇచ్చారు.
‘మీ అందరి ప్రేమ వల్ల, దయ వల్ల, ప్రభుత్వం అందించిన సహాయ సహకారాల వల్ల కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన తరవాత మెల్లమెల్లగా రోజురోజుకి నేను కోలుకుంటున్నాను. మళ్లీ పాటలు రాస్తున్నాను. నేను చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాను. కాకపోతే, ఈ కరోనా ఉండటం వల్ల ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రజలందరి మాదిరిగానే జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది తప్ప.. నా ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అశోక్ తేజ ఆరోగ్యం మళ్లీ విషమంగా ఉందని వార్తల్లో వచ్చినట్టు తెలిసింది. వాటిలో నిజం లేదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను’’ అని ఓ వీడియో మెసేజ్ లో క్లారిటీ ఇచ్చారు.









