
టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సమీకరణ 2023 పేరిట మారియట్ బోన్వాయ్ షాదీ కార్యక్రమం హైదరాబాద్ లోని వెస్టిన్ హోటల్‌లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో అనేక సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ నాయకురాలు డీకే అరుణ హాజరయ్యారు.
ప్రముఖ నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ టీచ్ ఫర్ చేంజ్ అనేది లాభాపేక్ష లేని సంస్థ. 2014లో స్థాపించబడిన ఈ సంస్థ ప్రభుత్వ పాఠశాలలో విద్య నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా కొనసాగుతోంది. అంతేకాదు ఫ్లాగ్‌షిప్ వాలంటీర్ ప్రొగ్రామ్, స్మార్ట్ క్లాస్ రూమ్‌ల నిర్వహణ, ప్రభుత్వ పాఠశాలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు తదితర అంశాల కోసం అవిశ్రాంతంగా కృషిచేస్తోంది. ప్రస్తుతం 248 ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 42 ,080 మంది విద్యార్థులు ఈ సంస్థ నుంచి లబ్దిపొందడం గమనార్హం అన్నారు. ఈ కార్యక్రమం లక్ష్యం నిధుల సేకరణ కోసమే అన్నారు.
టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ సీఈఓ బ్రహ్మచారి చైతన్య మాట్లాడుతూ, “నాణ్యమైన విద్యను పేద, మధ్యతరగతికి చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు అందించేందుకు మా సంస్థ ఎప్పుడూ కృషి చేస్తుంది. కాగా టీచ్ ఫర్ చేంజ్ ఫండ్‌రైజర్ అనేది డబ్బును సేకరించడానికి నిర్వహించబడే వార్షిక కార్యక్రమం. సంస్థ కోసం నిర్వహించిన ఈవెంట్ ద్వారా సేకరించిన నిధులు ట్రస్ట్ కార్యక్రమాల సామర్థ్యం పెంపొందించడం, స్కేలింగ్ చేయడంలో ఉపయోగించడం జరుగుతుంది” అని అన్నారు.
ఇక టీచ్ ఫర్ చేంజ్ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో ప్రదర్శించిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సంస్థ కి మద్దతుగా ప్రశంసలు పొందిన నటీనటులు ర్యాంప్ వాక్ చేయడం ఈ కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని, సైనా సెహ్వాల్, పారుపల్లి కశ్యప్, రెజీనా, ఫ్యాషన్ టీవీ తరపున సలోన్ తదితరులు పాల్గొన్నారు.









