Yashoda Issue : క్లారిటీ ఇచ్చిన నిర్మాత, ఈవా హాస్పిటల్ యాజమాన్యం


యశోద మూవీ వివాదం పై నిర్మాత నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. మా సినిమాలో ఈవా అనే పేరు నీ కాన్సెప్ట్ ప్రకారం పెట్టిందే కానీ వేరొకరి మనో భావాలను దెబ్బతీయడానికి కాదు. ఈవా వారిని నేను కలిసి జరిగినది చెప్పాను. ఇక ఫ్యూచర్ లో ఈవా అనే పదం యశోద సినిమాలో కనపడదు.. మా నిర్ణయాన్ని ఇవా వారు కూడా అంగీకరించారు. ఈ సమస్యకు ఇంతటితో పరిష్కారం అయ్యింది. ఇది తెలియక జరిగిన చిన్న డిస్ట్రబెన్స్ మాత్రమే అని అన్నారు.

ఈవా హాస్పిటల్ ఎండి మోహన్ రావు మాట్లాడుతూ, యశోద లో మా హాస్పిటల్ పేరు వాడటంతో మేము చాలా బాధ పడ్డాము. నిర్మాత చాలా తొందరగా సమస్యను క్లియర్ చేసారు. దీంతో సమస్య పరిష్కారం అయ్యింది. డాక్టర్స్ అందరూ కూడా ప్రాణాలు కాపాడాలని కోరుకుంటారు. సినిమా వాళ్ళు కూడా ప్రొఫెషన్ ను గౌరవించాలి. ఇప్పటికీ ఎవరికైనా ఏదైనా జరిగితే ఠాకూర్ సినిమా లాగా జరిగింది అంటారు. సినిమా చాలా బలమైన మాధ్యమం అని అన్నారు.