ఈ వారం సమంతను ఆపే వాళ్లు లేరు…


సౌత్ లో లేడీ సూపర్ స్టార్ స్టేటస్ అందుకున్న అతితక్కువ మంది హీరోయిన్స్ లో సమంత ఒకరు. హీరోల పక్కన నటించే దెగ్గర నుంచి తానే ముందుండి సినిమాని నడిపించే వరకూ కెరియర్ ని బిల్డ్ చేసుకున్న సమంత, తాజాగా నటించిన చిత్రం యశోద. హరి-హరీష్ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ ని శివలెంక కృష్ణ ప్రసాద్ ప్రొడ్యూస్ చేశాడు. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఈ మూవీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 6.53 కోట్ల షేర్, 11.50 కోట్ల గ్రాస్ ని రాబట్టి సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా యశోద సినిమా ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ 18.5 కోట్ల షేర్ ని రాబట్టింది.

సమంత వన్ మ్యాన్ షో చేసింది అనే ఫీడ్ బ్యాక్ రాబట్టిన యశోద సినిమాకి సెకండ్ వీక్ లో కూడా బ్రేకులు పడే అవకాశం కనిపించట్లేదు. ఈ వీక్ బాక్సాఫీస్ ముందుకి వచ్చిన చిన్న సినిమాలు, యశోద కలెక్షన్స్ ని బ్రేక్ వేసే రెంజులో టాక్ ని రాబట్టలేక పోయాయి. దీంతో ఇప్పట్లో సమంత సినిమా కలెక్షన్స్ లో భారి డ్రాప్ కనిపించే అవకాశం తక్కువే. లాంగ్ రన్ దొరికింది కాబట్టి, సెకండ్ వీక్ ఎండ్ అయ్యే లోపు యశోద సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అయిపోయి ప్రాఫిట్స్ లోకి వెళ్లిపోతే… ప్రమోషన్స్ కి అందుబాటులో లేకపోయినా లాభాలు తెచ్చి పెట్టిన హీరోయిన్ గా సమంతా తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసినట్లే అవుతుంది. ఇదిలా ఉంటే యశోద సినిమాకి సీక్వెల్ ని ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.