Telangana Elections 2023 : క్యూలో నిలబడి ఓటు వేసిన అల్లుఅర్జున్, ఎన్టీఆర్


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం 4 గంటలకే ముగియనుంది. ఇక ఓటు హక్కును వినియోగించేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Also Read :  Abhisun Jeevinth: డైరెక్టర్‌గా హిట్టు.. హీరోగా సక్సెస్ .. ఇప్పుడు 'డ్రామా కంపెనీ'తో హ్యాట్రిక్‌పై కన్నేసిన అభిషన్ జీవింత్!

జూబ్లీహిల్స్ లోని బీఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓటు వేయగా.. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కును వినియోగించుకున్నారు.