మిలియన్ క్లబ్ లో సాయి పల్లవి

సాయి పల్లవి మంచి డ్యాన్సర్. ఇప్పటికే ఆమెకు మిలియన్ హిట్స్ వుండే సాంగ్స్ వున్నాయి.
 ఇప్పుడు ‘లవ్‌ స్టోరి’ చిత్రంలోని సారంగ దరియా గీతం సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన  తక్కువ కాలంలోనే 1 మిలియన్‌ లైక్స్‌ సొంతం చేసుకున్న తొలి తెలుగు పాటగా నిలిచింది.

ఫిబ్రవరి 28న   ఈ పాటని విడుదల చేశారు. ఇప్పటి వరకు 90 మిలియన్లకి పైగా వీక్షణలు సొంతం చేసుకుని, శ్రోతల్లో జానపదానికి ఉన్న ఆదరణ ఎలాంటిదో తెలియజేస్తోంది ఈ గీతం. పాటకు తగినట్టు సాయి పల్లవి చేసిన నృత్యం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటని  సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందించగా పవన్‌ సి.హెచ్‌. స్వరాలు సమకూర్చారు. మంగ్లీ సింగర్ . ఏప్రిల్‌ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.