వకీల్ సాబ్ లో త్రివిక్రమ్ హస్తం ఎంత ?

దిల్ రాజు కాంపౌండ్ దర్శకుడు వేణు శ్రీరామ్. ఓ మై ఫ్రండ్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఐతే ఈ సినిమా డిజాస్టర్. తర్వాత వేణు శ్రీరామ్ పేరు వినిపించలేదు. దాదాపు ఏడేళ్ళు గ్యాప్ తీసుకొని నానితో ఎంసీఏ చేశాడు. ఇది ఓకే అనిపించింది. ఐతే సడన్ గా ఓ బంపర్ ఆఫర్ తగిలింది వేణుకి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసి ఛాన్స్ వచ్చింది. బాలీవుడ్ హిట్ పింక్ సినిమా వకీల్ సాబ్ గా తెలుగు ప్రేక్షకులకు చుపించబోతున్నారు. ఐతే ఈ సినిమాకి రచనా సహకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ అని మొదటి నుండి వినిపించింది.

ఐతే దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు వేణు. ‘వకీల్ సాబ్ కి మూలకారణం దిల్ రాజు, త్రివిక్రమ్. దిల్ రాజు గారు నా పేరుని త్రివిక్రమ్ కి చెప్పారు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి రికమెండ్ చేశారు. త్రివిక్రమ్ అప్పటికే అల వైకుంటపురం పోస్ట్ ప్రొడక్షన్ లో వుండటం చేత స్క్రిప్ట్ నన్నే రాయమని చెప్పారు. రాశాను. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ గారికి నచ్చింది. నిజంగా ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ గారి సహాయాన్ని మర్చిపోలేను. భవిష్యత్ లో ఆయన రచన చేస్తే నేను దర్శకత్వం వహించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు వేణు.