విశ్వక్ క్లారిటీ ఇచ్చాడు కానీ

విశ్వక్ సేన్ ‘హిట్’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ  సినిమాకు సీక్వెల్ లో మాత్రం విశ్వక్ లేడు.  హిట్ 2 సినిమా కు నో చెప్పాడు. హిట్ సినిమా విడుదలైన సమయంలోనే సీక్వెల్ ప్రకటన వచ్చింది.  అలాంటి విశ్వక్ సేన్ హిట్ 2 లో మాత్రం నటించనంటూ తప్పుకోవడం టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. ఐతే దర్శక నిర్మాతలు హిట్ 2 కోసం అడిగిన డేట్లు సర్దు బాటు చేయలేక పోవడం వల్లే ఆ సినిమాను వదులుకున్నట్లుగా విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు.  

”ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్‌’ సీక్వెల్స్‌ ఆలోచనలున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత  గత చిత్రాలతో సంబంధం లేకుండా ఏ హీరో అయినా కొత్తగా నిరూపించుకోవాల్సి వస్తోంది. ఆ దిశగా ప్రయత్నిస్తున్నా. అలాగే హిట్ సీక్వెల్‌ నేనే చేయాల్సింది. చేతిలో ఉన్న సినిమాల వల్ల.. డేట్స్‌ సర్దుబాటు కాలేదు.” అని చెప్పుకొచ్చాడు విశ్వక్. ఐతే కొన్ని క్రియేటివ్ విభేదాలు వలన విశ్వక్ ఈ సీక్వెల్ వదిలేసాడనే టాక్ వుంది. కానీ విశ్వక్ మాత్రం డేట్స్ సమస్య అని చెబుతున్నాడు. మొత్తానికి విశ్వక్ నుండి ఐతే క్లారిటీ వచ్చేసింది. హిట్ సీక్వెల్ ని అడవి శేష్ చేస్తున్న సంగతి తెలిసిందే.  

ReplyForward